Pedana: పెడనను మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతాం: కాగిత కృష్ణ ప్రసాద్!
Pedana: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అంటేనే అభివృద్ధి అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు.
Pedana: పెడనను మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతాం: కాగిత కృష్ణ ప్రసాద్!
పెడన: అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే కుటమి ప్రభుత్వం అనేలా పనిచేశామని నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు.
ఈ మేరకు తోట మూలలో గల తమ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పురపాలక శాఖ మంత్రి నారాయణ ఎంపీ బాలశౌరి సహకారంతో పెడన పట్టణాన్ని మోడల్ పట్టణముగా రూపుదిద్దడానికి కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు. కుటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో పట్టణానికి కోట్ల రూపాయల నిధులతో డ్రైనేజీ సిసి రోడ్లు ఎలక్ట్రికల్ పోల్స్ వీధి దీపాలు ఇలా అనేక కార్యక్రమాలు ప్రజా అవసరాలను బట్టి నిర్మిస్తున్నామని అన్నారు.
పట్టణంలో గల వేలాదిమంది ప్రజల ఆకాంక్ష మేరకు హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి కూడా పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వైసీపీ హయాంలో ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేశారని కూటమి ప్రభుత్వంలో అడిగితే చాలు తక్షణమే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వైసిపి హయాంలో నిర్మితమైన కాలనీలలో మౌలిక వసతులు పూర్తిగా వారు గాలికి వదిలేసారని నేడు ఆ కాలనీలో రక్షిత మంచినీటి పథకాలను సిసి రోడ్ల నిర్మాణాలను డ్రైనేజీలను వేగవంతం చేశామని పేర్కొన్నారు.
15వ ఆర్థిక సంఘం నిధులతో పట్టణంలో సమగ్ర డ్రైనేజీ ప్రణాళికను రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ వేసవకాలం వచ్చిందంటే పట్టణ పట్టణ ప్రజల దాహార్తికి అలమటిస్తున్నారని దానికి సంబంధించిన కాంప్రహెన్సివ్ వాటర్ స్కీమ్ ను పూర్తి చేస్తామని దీంతో పట్టణ ప్రజల దాహార్తి తీరుతుందని హామీ ఇచ్చారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పెడన పట్టణం ప్రగతి పథంలో నడుస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి ఎస్ సి ఎస్ పి,ఎస్ బి ఎం( స్వచ్ఛభారత్ ) ఎస్ టి పి, 15వ ఆర్థిక సంఘం నిధులు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు సిసిఎఫ్ నిధులు ఏఐఐబి నిధులు ఇలా కోట్ల రూపాయల నిధులను పట్టణ అభివృద్ధికి వెచ్చిస్తున్నామని అన్నారు. అలాగే పట్టణంలో చేనేత కలంకారి ఎక్కువగా ఉండటంతో కలంకారీ కి సంబంధించిన మురుగు డ్రైనేజీ నీరును వివిధ రకాల టెస్టింగులకు పంపించి మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంటులను గుడివాడ రోడ్డు తామర చెరువు ప్రక్కన మచిలీపట్నం రైల్వే గేటు వద్ద బ్రహ్మపురం లోను పట్టణంలో మూడు చోట్ల ఏర్పాట్లకు సిద్ధమవుతున్నామని చెప్పారు.
అంతేగాక పట్టణంలో సెంట్రల్ లైటింగు, డివైడర్లు, బైపాస్ రోడ్లలో కూడా ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బ్రహ్మపురంలో ఉన్న బొడ్డు నాగయ్య కాలేజీ నందు వాకింగ్ ట్రాక్ను, పైడమ్మ అమ్మవారి గుడి వెనుక గల చెరువు నందు వాకింగ్ ట్రాకు చెరువు సుందరీ కరణ, ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి డిటి పాలెం వరకు రోడ్డు డీటీపాలెం నుండి మచిలీపట్నం వైపుకు మరొక రోడ్డును ప్రతి పాదంలో పెట్టామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి జోగి రమేష్ నేతన్న నేస్తం కార్యక్రమానికి విచ్చేసిన జగన్మోహన్ రెడ్డి పట్టణ అభివృద్ధికి ఇచ్చిన 102 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా పెడనకు రాలేదని అన్నారు. శంకుస్థాపనలు చేసి గాలికి వదిలేయడమే వైసిపి పని అని ఏద్దేవ చేశారు. కానీ కూటమి ప్రభుత్వంలో ప్రతిపాదనల కంటే ముందే పనులను ప్రారంభిస్తామన్నారు.ఈ సమావేశంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు యక్కల శ్యామలరావు,చందన నారాయణరావు, బొడ్డు దీక్షానందుడు,పూల బాబు, ఏఈ రామాంజనేయులు, కూటమి ప్రభుత్వ నాయకులు తదితరులు ఉన్నారు.




