Pedana: సెప్టెంబర్ 11లోపు అభ్యంతరాలు తెలపాలి: కమిషనర్ కొండయ్య!
Pedana: కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీలో వార్డుల సంఖ్యను 23 నుంచి 28కి పెంచేందుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదలైంది.
Pedana: సెప్టెంబర్ 11లోపు అభ్యంతరాలు తెలపాలి: కమిషనర్ కొండయ్య!
పెడన: వార్డుల ప్రతిపాదనలకు సంబంధించిన డ్రాఫ్ట్ వార్డు విభజనల మ్యాపులు, వివరణాత్మక వివరాలు నోటీసు బోర్డులో ఉంచటం జరిగిందని దీనిపై అభ్యంతరాలు ఉంటే ఏడు రోజులు లోపు తెలుపగలరని మున్సిపల్ కమిషనర్ కొండయ్య తెలిపారు.
ఈ మేరకు ఆయన తమ కార్యాలయంలో నోటీసు బోర్డులో వార్డుల మ్యాప్ నోటీసును అంటించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ కమిషనర్ మరియు సంచాలకులు పురపరిపాలనశాఖ వారి ఉత్తర్వులు నం. 13021/2026/ హెచ్1-2 ద్వారా తేదీ: 01.04.2026. ప్రస్తుతం పెడన మున్సిపాలిటీ లో గల 23 వార్డులను 28 వార్డులు గా పునర్విభజించుటకు ప్రతిపాదించబడినది అని ఈ వార్డుల ప్రతిపాదనలకు సంభందించి డ్రాఫ్ట్ వార్డ్ విభజన మ్యాపులు మరియు వివరణాత్మక వివరాలు మున్సిపల్ కమిషనరు వారి కార్యాలయములో సాదారణ ప్రజల పరిశీలనకు ఉంచబడినవి అని తెలిపారు.
సాదారణ ప్రజలు,ప్రజాప్రతినిధులు, ఆసక్తి గలవారు తమ అబియంతరాలు/ సూచనలు ఈ ప్రకటన ప్రచురించిన తేదీ నుండి 7 (ఏడు )రోజుల లోపు అనగా తేదీ: 11.09.2026 సాయంత్రం 5.00 గం. లోపు వ్రాతపూర్వకముగా కమిషనరు,పెడన పురపాలకసంఘం వారికి సమర్పించవలసినదిగా కోరుతున్నామన్నారు. మరిన్ని వివరాలకు సంభందించి డ్రాఫ్ట్ వార్డ్ విభజన మ్యాపులు మరియు వివరణాత్మక వివరాలు మున్సిపల్ కార్యాలయం,తహశీల్దార్ కార్యాలయం,మండల పరిషత్ అభియుర్ధి అధికారి కార్యాలయం,సబ్ రిజిస్టర్ కార్యాలయం,స్టేషన్ హౌస్ ఆఫీసర్ కార్యాలయం, అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయం,విద్యుతు శాఖ వారి కార్యాలయపు నోటిస్ బోర్డులలో పరిశీలనార్ధం ఉంచబడినది అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.




