Pedana: రైల్వే సమస్యల పరిష్కారానికే జనసంవాద్: ఎస్ఎస్ నాగేశ్వరరావు!

Pedana: కృష్ణా జిల్లా పెడన రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన జనసంవాద్ కార్యక్రమంలో ప్రయాణికుల సమస్యలు వెల్లువెత్తాయి. పార్కింగ్ భద్రత, ప్లాట్‌ఫామ్ విస్తరణపై వినతులు సమర్పించారు.

Reddy, Pedana
Published on: 22 Oct 2026 10:56 PM IST
Pedana
X

Pedana: రైల్వే సమస్యల పరిష్కారానికే జనసంవాద్: ఎస్ఎస్ నాగేశ్వరరావు!

పెడన: ప్రయాణికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే దిశగా రైల్వే జన సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పట్టణ రైల్వే స్టేషన్ ఎస్ ఎస్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే జన సంవ్వాద్ కార్యక్రమాన్ని ప్రయాణికులతో కలిసి ప్రత్యేక అధికారులు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఎస్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్ లో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా జనసంవాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ కు సంబంధించిన సమస్యలను ప్రయాణికులు అధికారులకు తెలియజేస్తే సత్వర పరిష్కార దిశగా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమానికి రైల్వే శాఖ అధికారులు ఎస్ ఎస్ ఈ అధికారులు గుడివాడ నుండి సప్తగిరి మచిలీపట్నం నుండి భాస్కర్ హాజరయ్యారు. ఇరువురు ప్రయాణికుల వద్ద నుండి స్టేషన్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీంతో కొంతమంది ప్రయాణికులు మాట్లాడుతూ రైల్వేస్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్, ప్రయాణికుల ద్విచక్ర వాహనాల పార్కింగ్కు భద్రత, వే బ్రిడ్జి వద్ద లిఫ్ట్ సౌకర్యం, భారీ ట్రైన్ లకు ప్లాట్ఫామ్ సరిపోకపోవడంతో ప్లాట్ఫాముల విస్తరణ, మరుగుదొడ్ల శుభ్రత నిర్వహణ, ఇలా అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

అంతేగాక చాలా ద్విచక్ర వాహనాలు ఇక్కడ ఉన్న పార్కింగ్లో భద్రత లేకపోవడం వలన దొంగిలించబడ్డాయి అని తెలిపారు. ఈ దొంగతనాలపై స్థానిక పోలీస్ స్టేషన్ లో అనేక ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని కూడా అన్నారు.దీంతో స్పందించిన అధికారులు వెంటనే ఉన్నత అధికారులకు ప్రయాణికులు ఇచ్చిన సమగ్ర సమాచారాన్ని రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు కలుగుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి రైల్వే ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

ఈ జనసంవ్వద్ కార్యక్రమంలో పట్టణంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు,మాజీ కౌన్సిల్ సభ్యులు అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కొంతమంది పాత్రికేయులు పాల్గొన్నారు.

Reddy, Pedana

Reddy, Pedana