Pedana: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి 30వ వార్షికోత్సవ వేడుకలు

Pedana: పెడనలో ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి 30వ వార్షికోత్సవ వేడుకలు. ఎస్‌వీవీ టీం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల నిర్వహణ, బహుమతులు అందజేత.

Reddy, Pedana
Published on: 15 Sept 2026 11:17 PM IST
Pedana
X

Pedana: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి 30వ వార్షికోత్సవ వేడుకలు

పెడన: కృష్ణాజిల్లా పెడన పట్టణం మఠం వీధి 14వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 30 వ వార్షికోత్సవ మహోత్సవాలు కన్నుల పండుగ నిర్వహించారు.ఎస్ వి వి టీం ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించి.. మొదటి బహుమతి కుమ్మరిగుంట అలేఖ్య, ద్వితీయ బహుమతి వాసా భవాని,తృతీయ బహుమతి బళ్ల వెంకటలక్ష్మి,వీరంకి సుష్మ గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.

అత్యంత భక్తిశ్రద్ధలతో చక్కటి అలంకరణ విద్యుత్ కాంతులతో దీపాలతో సమర్థవంతమైన, నిర్వహణతో ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు.పూజల అనంతరం భక్తులకు గణనాథుడి ప్రత్యేక దర్శనం కల్పించారు.ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ప్రత్యేక పూజలు,దర్శన కార్యక్రమాల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

Reddy, Pedana

Reddy, Pedana