Uyyuru: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 32 వార్డుల్లో క్లీన్ స్వీప్ లక్ష్యం!

Uyyuru: ఉయ్యూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు రూ. 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించారు

Ramana, Penamaluru
Published on: 28 Aug 2026 9:48 AM IST
Uyyuru
X

Uyyuru: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 32 వార్డుల్లో క్లీన్ స్వీప్ లక్ష్యం!

Uyyuru: ఉయ్యూరు సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 32 వార్డుల్లో క్లీన్ స్వీప్ లక్ష్యం: ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు... ఉయ్యూరు పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు అన్నారు...

ఉయ్యూరు పట్టణంలోని షాదీఖానా చైర్మన్ కుద్దూస్ గారు నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు మాజీ ఎమ్మెల్సీ శ్రీ వైవీబీ రాజేంద్రప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు,అంతకుముందు వీరమ్మ తల్లి ఆలయం నుంచి షాదీఖానా వరకు ర్యాలీ నిర్వహించారు...

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ:

₹100 కోట్లతో కృష్ణా జలాల సరఫరా

ఉయ్యూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ₹100 కోట్ల వ్యయంతో కృష్ణా నది తాగునీటి సరఫరా పనులు చేపట్టామని తెలిపారు, తోట్లవల్లూరు నుంచి పైప్‌లైన్లు,మూడు కొత్త ట్యాంకుల నిర్మాణం,పాత పైపుల మార్పు ద్వారా పట్టణంలో దాదాపు 11,000 కుళాయి కనెక్షన్లు అందించనున్నట్లు వెల్లడించారు...

🏠 1,800 మంది పేదలకు టిడ్కో ఇళ్లు

గత వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన టిడ్కో గృహాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి డిసెంబర్ నాటికి 1,800 మంది పేదలకు గృహప్రవేశాలు చేయిస్తామని తెలిపారు,టిడ్కో ప్రాంతంలో ₹ 1 కోట్లతో కమ్యూనిటీ హాల్,రోడ్లు,పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని చెప్పారు...

అలాగే ఎగినపాడు,గండిగుంట పరిధిలోని మిగిలిన టిడ్కో ఇళ్లను ఫిబ్రవరి/మార్చి నాటికి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు...

🛣️ ₹10 కోట్లతో రోడ్లు,డ్రైనేజీలు,పార్కుల అభివృద్ధి...

త్వరలో ₹10 కోట్ల ప్రణాళిక నిధులతో రోడ్లు, డ్రైనేజీలు,పార్కుల అభివృద్ధి పనులకు టెండర్లు పిలవనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు,జనరల్ ఫండ్స్ నుంచి మరో ₹1 కోటితో చిన్న రోడ్లు, కాలువల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు...

🏛️ 45 రోజుల్లో షాదీఖానా అందుబాటులోకి

ప్రస్తుతం ఉన్న సచివాలయాలను వేరే ప్రాంతానికి తరలించి,45 రోజుల్లో షాదీఖానా కమిటీని ఏర్పాటు చేసి షాదీఖానాను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు హామీ ఇచ్చారు...

🟡 32 వార్డుల్లో కూటమి క్లీన్ స్వీప్ లక్ష్యం

గత ఎన్నికల్లో ఉయ్యూరు ప్రజలు అందించిన 7,200 పైచిలుకు మెజార్టీ కూటమిపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు...

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి శ్రేణులు వర్గ విభేదాలకు తావులేకుండా ఐక్యంగా పనిచేసి 32 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు,మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు,కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు...

అభివృద్ధి – సంక్షేమం రెండింటినీ సమతూకంగా ముందుకు తీసుకెళ్తూ ఉయ్యూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు స్పష్టం చేశారు...

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story