Kankipadu: కుందేరు గ్రామంలో గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్

Kankipadu: కుందేరు గ్రామంలో జరిగిన గ్రామసభలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలను వివరించారు.

Ramana, Penamaluru
Updated on: 1 Oct 2026 6:01 PM IST
Kankipadu
X

Kankipadu: కుందేరు గ్రామంలో గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్

కంకిపాడు: కంకిపాడు మండలం కుందేరు గ్రామంలో నిర్వహించిన గ్రామసభ సమావేశంలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు పాల్గొని ప్రజల సమస్యలు, గ్రామ అభివృద్ధి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

CVAPU ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గ్రామసభలో అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

పింఛన్లు

తల్లికి వందనం

అన్నదాత సుఖీభవ

సిమెంట్ రోడ్లు

బంగారు కుటుంబాలు గ్రామ మౌలిక వసతుల అభివృద్ధి ప్రజల అవసరాలు తెలుసుకోవడం… సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం… వాటికి పరిష్కార మార్గాలను చూపించడం… ఇదే ప్రజా పాలనకు నిజమైన అర్థం అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు పేర్కొన్నారు.

కుందేరు గ్రామ అభివృద్ధికి అవసరమైన పనులకు ప్రాధాన్యతనిస్తూ,ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ప్రజల మధ్యే ఉంటూ… ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావిస్తూ… పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా బోడే ప్రసాద్ గారి అడుగులు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు,అధికారులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru