Penamaluru: నూతన ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దంపతుల సత్కారం!

Penamaluru: పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీని ఎమ్మెల్యే బోడే ప్రసాద్, బోడే హేమ దంపతులు ఘనంగా సత్కరించారు.

Ramana, Penamaluru
Published on: 16 Nov 2026 12:41 PM IST
Penamaluru
X

Penamaluru: నూతన ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దంపతుల సత్కారం!

పెనమలూరు: పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవిస్తూ ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు వారి సతీమణి శ్రీమతి బోడే హేమ గారు హాజరై, నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ,ఎంపీటీసీ సభ్యులతో పాటు ఎంపీపీని ఘనంగా సత్కరించారు,శాలువాలు కప్పి,పుష్పగుచ్ఛాలు అందజేసి వారి విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ,ప్రజలు ఇచ్చిన తీర్పు ఎంతో విలువైనదని,ప్రజల నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని ఆకాంక్షించారు,గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన,అభివృద్ధి కార్యక్రమాల అమలు,ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru