Penamaluru: రైతు భూమికి రాజముద్రే రక్షణ: ఎమ్మెల్యే బోడే ప్రసాద్

Penamaluru: పెనమలూరులో 853 మంది రైతులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అధికారిక రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా పంపిణీ చేశారు.

Ramana, Penamaluru
Published on: 3 Oct 2026 3:57 PM IST
Penamaluru
X

Penamaluru: రైతు భూమికి రాజముద్రే రక్షణ: ఎమ్మెల్యే బోడే ప్రసాద్

పెనమలూరు: పెనమలూరు గ్రామంలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు నిర్వహించారు, ఈ సందర్భంగా రైతులకు స్వయంగా పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ... పెనమలూరు గ్రామంలో 853 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. రైతు భూమికి సంబంధించిన హక్కులు, వివరాలు అధికారికంగా నమోదై ఉండటం రైతులకు భరోసాను కల్పిస్తుందని అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు సంబంధించిన అధికారిక పట్టాదారు పాస్ పుస్తకాలపై వ్యక్తిగత ఫొటోలు ముద్రించి రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని బోడే ప్రసాద్ గారు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత ప్రచారాలకు తావులేకుండా,ప్రభుత్వ అధికారిక రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు.

రీ-సర్వే ద్వారా భూమి వివరాలను స్పష్టంగా నమోదు చేసి,రెవెన్యూ రికార్డుల్లో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు,భూమి విస్తీర్ణం,హక్కుదారుల వివరాలు వంటి అంశాలు స్పష్టంగా నమోదవడం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం తగ్గుతుందని తెలిపారు.

భూముల కొనుగోలు,అమ్మకాల సమయంలో రీ-సర్వే ద్వారా రూపొందించిన రికార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలను రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం కొత్త యజమాని పేరుపై రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.

రైతుల భూములకు ప్రభుత్వమే పూర్తి రక్షణ కల్పించేలా,భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు స్పష్టం చేశారు.

ప్రజల ఆస్తులకు సంబంధించిన అధికారిక పత్రాలపై నాయకుల వ్యక్తిగత చిత్రాలకు కాకుండా ప్రభుత్వ అధికారిక ముద్రకే ప్రాధాన్యం ఉండాలనే ఉద్దేశంతో ఈ మార్పు తీసుకొచ్చామని తెలిపారు.

రైతుల హక్కులు,భూముల రక్షణ, పారదర్శకమైన భూ రికార్డుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు వివరించారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రెవెన్యూ అధికారులు,సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru