Kankipadu: కోలవెన్ను ఎంపీపీ స్కూల్లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనిఖీ

Kankipadu: కంకిపాడు మండలం కోలవెన్ను ఎంపీపీ పాఠశాలను పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థుల అభ్యాస స్థాయిలను, వసతులను పరిశీలించారు.

Ramana, Penamaluru
Published on: 1 Oct 2026 5:01 PM IST
Kankipadu
X

Kankipadu: కోలవెన్ను ఎంపీపీ స్కూల్లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనిఖీ

Kankipadu: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదా? పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా? విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అనే అంశాలను స్వయంగా తెలుసుకునేందుకు పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడె ప్రసాద్ గారు కోలవెన్ను ఎంపీపీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు నేరుగా ముచ్చటించి, ఇప్పటివరకు బోధించిన పాఠ్యాంశాలు, సిలబస్‌పై ప్రశ్నలు అడిగి వారి అవగాహనను స్వయంగా తెలుసుకున్నారు విద్యార్థుల చదువు,అభ్యాస స్థాయిపై ఆరా తీశారు.

అనంతరం పాఠశాల రిజిస్టర్లను పరిశీలించి, పాఠశాల నిర్వహణ,విద్యా బోధన తీరుపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు అందుతున్న తాగునీరు, మధ్యాహ్న భోజనం,వంటశాల నిర్వహణను పరిశీలించిన ఎమ్మెల్యే గారు ప్రతిరోజూ అందిస్తున్న మెనూ,భోజనం నాణ్యతపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు,అలాగే విద్యార్థులు వినియోగించే బాత్రూంలను స్వయంగా పరిశీలించి పరిశుభ్రతను తనిఖీ చేశారు.

విద్యార్థుల భవిష్యత్తే మన బాధ్యత అనే లక్ష్యంతో పాఠశాలలో విద్యా ప్రమాణాలతో పాటు పరిశుభ్రత,తాగునీరు,పోషకాహారం, మౌలిక సదుపాయాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని బోడే ప్రసాద్ గారు సిబ్బందికి సూచించారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరమైన,పరిశుభ్రమైన విద్యా వాతావరణాన్ని కల్పించాలని విద్యార్థులు చదువులో మరింతగా రాణించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే గారు సూచించారు.

పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు.

విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి.

ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కారానికి చర్యలు — ఇదే బోడే ప్రసాద్ గారి కార్యాచరణ

Ramana, Penamaluru

Ramana, Penamaluru