Penamaluru: రూ.1 కోటితో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్

Penamaluru: రూ.1 కోటితో ముదునూరు-దూసరపాలెం రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి జోరుగా సాగుతోందన్నారు.

Ramana, Penamaluru
Published on: 1 Sept 2026 5:29 PM IST
Penamaluru
X

Penamaluru: రూ.1 కోటితో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్

పెనమలూరు: పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. ముదునూరు–దూసరపాలెం రహదారి నిర్మాణానికి రూ.1 కోటి నిధులతో ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు శంకుస్థాపన చేశారు. కాటూరు నుంచి ముదునూరు వెళ్లే ప్రధాన రహదారి నుంచి దూసరపాలెం గ్రామాన్ని కలిపే ఈ రహదారి నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ,గతంలో ఆగిపోయిన అభివృద్ధి పనులకు మళ్లీ వేగం తీసుకొచ్చామని,ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు.

అదేవిధంగా ముదునూరు నుంచి జాబర్లపూడి వరకు రూ.17 లక్షల నిధులతో ప్రధాన రోడ్డు నిర్మానికి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దాదాపు రూ.12 కోట్ల విలువైన అభివృద్ధి పనులను వరుసగా ప్రారంభిస్తున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే గారు తెలిపారు...

*ప్రజల అవసరాలు – అభివృద్ధికి ప్రాధాన్యత పెనమలూరు అభివృద్ధే లక్ష్యం*... ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు,అధికారులు తదితరులు,పాల్గొన్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story