Kankipadu: కుందేరు వంతెనకు రూ.7 కోట్లు: ఎమ్మెల్యే బోడే ప్రసాద్

Kankipadu: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కుందేరు వంతెన పనులను రూ.7 కోట్లతో పునఃప్రారంభిస్తున్నట్లు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రకటించారు.

Ramana, Penamaluru
Published on: 1 Oct 2026 4:56 PM IST
Kankipadu
X

Kankipadu: కుందేరు వంతెనకు రూ.7 కోట్లు: ఎమ్మెల్యే బోడే ప్రసాద్

Kankipadu: కంకిపాడు మండలం కుందేరు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు పాల్గొని వృద్ధులు,దివ్యాంగుల యోగక్షేమాలను స్వయంగా తెలుసుకుని పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ… *పేదల సంక్షేమం,గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని *తెలిపారు,ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు మహిళలు వృద్ధులు,దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

కందలంపాడు–కాటూరు మధ్య ప్రధాన వంతెన కూలిపోయి సుమారు 15–20 ఏళ్లుగా ప్రజలు తాత్కాలిక బెయిలీ బ్రిడ్జిపై తీవ్ర ఇబ్బందులతో రాకపోకలు సాగిస్తున్న పరిస్థితిని ఎమ్మెల్యే గారు గుర్తుచేశారు ,వంతెన రేకులు తరచూ దెబ్బతినడంతో రైతుల ఎడ్లబండ్లు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

గతంలో మంజూరైన నిధులతో పనులు ప్రారంభమైనప్పటికీ,అనంతరం పనులు నిలిచిపోయాయని పేర్కొన్న ఎమ్మెల్యే గారు… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిచిపోయిన అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

కుందేరు వంతెన నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు చేయించి,టెండర్ల ప్రక్రియను పూర్తి చేశామని బోడే ప్రసాద్ గారు తెలిపారు,భూమి సమస్యల కారణంగా పనులు నిలిచిపోకుండా, భూమి కోల్పోయే రైతులతో మాట్లాడి అవసరమైన భూ సర్దుబాట్లు చేసి అయినా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ప్రజలకు ఏళ్లుగా ఎదురవుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడమే నా లక్ష్యం, పనులు ఆగకుండా స్వయంగా పర్యవేక్షిస్తాను అని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు.

అలాగే కుందేరు గ్రామంలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి VBG Ram G పథకం కింద రూ.40 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు.

సాంకేతిక కారణాలతో గతంలో వెనక్కి వెళ్లిన నిధులను సరిచేసి డ్రైన్-కమ్-రోడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయించామని తెలిపారు,మరో రెండు మూడు రోజుల్లో కుందేరు గ్రామానికి వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు.

అదేవిధంగా ఆర్‌అండ్‌బీ పరిధిలోని మరో వంతెన పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు పేర్కొన్నారు.

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు…

ఇక ఒక్కొక్కటిగా పరిష్కారం!

కుందేరు అభివృద్ధికి బోడే ప్రసాద్ గారి అడుగు

ప్రజలకు మౌలిక వసతులు – గ్రామానికి అభివృద్ధి బాట.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru