Penamaluru: ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన పెనమలూరు ఎంపీటీసీలు!

Penamaluru: పెనమలూరు ఎంపీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అభ్యర్థులు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

Ramana, Penamaluru
Published on: 7 Nov 2026 7:06 PM IST
Penamaluru
X

Penamaluru: ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన పెనమలూరు ఎంపీటీసీలు!

పెనమలూరు: పెనమలూరు మండలం,పెనమలూరు గ్రామంలో ఎంపీ.టీసీ.లుగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎంపీ.టీసీ.లు పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు విజయం సాధించిన ఎంపీ.టీసీ.లను అభినందించి,ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి,ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru