Penamaluru: సైకిల్ గుర్తుపై కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో అజాద్!
Penamaluru: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ 25వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన టీడీపీ నేత అనంతనేని అజాద్ నామినేషన్ దాఖలు చేశారు.
Penamaluru: సైకిల్ గుర్తుపై కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో అజాద్!
పెనమలూరు: తాడిగడప మున్సిపాలిటీలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. ఇందులో భాగంగా 25వ వార్డు కౌన్సిలర్ స్థానానికి కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనంతనేని అజాద్ నామినేషన్ దాఖలు చేశారు.
సైకిల్ ఎన్నికల గుర్తుతో ఎన్నికల బరిలో నిలిచిన ఆయన, వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నవంబర్ 26న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 25వ వార్డులో ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది.




