Nandigama: పరిటాలలో ప్రచారానికి బ్రహ్మరథం: కోగంటి శివనాగమల్లేశ్వరి
Nandigama: ఎన్టీఆర్ జిల్లా పరిటాల సెగ్మెంట్-3 ఎంపీటీసీ కూటమి అభ్యర్థి కోగంటి శివనాగమల్లేశ్వరి ఇంటింటికీ తిరిగి సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేశారు.
Nandigama: పరిటాలలో ప్రచారానికి బ్రహ్మరథం: కోగంటి శివనాగమల్లేశ్వరి
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ: పరిటాల గ్రామంలో కోగంటి అభివృద్ధి వీధుల్లో కనిపిస్తుంది. గ్రామం యొక్క రూపు రేఖలు మార్చడానికి ఎంపీటీసీ గా పోటీ: కోగంటి శివనాగమల్లేశ్వరి.
కంచికచర్ల మండలం పరిటాల గ్రామ సెగ్మెంట్ 3 నుంచి ఎంపీటీసీ అభ్యర్థి గా కూటమి బలపరిచిన,తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న "కోగంటి శివనాగమల్లేశ్వరి" ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటి ,ఇంటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు కోగంటి శివనాగమల్లేశ్వరి.
ఈ సందర్భంగా కోగంటి శివనాగమల్లేశ్వరి మాట్లాడుతూ: పరిటాల గ్రామంలో ప్రజలు పలు సమస్యలు నా దృష్టికి తీసుకుని వచ్చారు గెలిచిన తర్వాత వారి సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చాను. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, ఇంటి స్థలాలు, పింఛన్లు,కరెంట్ సమస్యలు తెలిపారు.
ప్రజలందరూ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి నన్ను భారి మెజారిటీతో గెలిపించాలని తెలిపారు ఎంపీటీసీ అభ్యర్థి "కోగంటి శివనాగమల్లేశ్వరి".




