Penamaluru: 100 ఫిట్ రోడ్డు ప్రమాదం జీప్ ఢీకొని వ్యక్తికి గాయాలు!

Penamaluru: తాడిగడప 100 ఫిట్ రోడ్డులోని ఎస్‌విఎన్ కన్వెన్షన్ వద్ద వేగంగా వచ్చిన జీప్ కారు రాపిడో బైక్‌ను ఢీకొట్టింది ప్రమాదంలో బైక్ ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి.

Ramana, Penamaluru
Published on: 13 Aug 2026 1:09 PM IST
Penamaluru
X

Penamaluru: 100 ఫిట్ రోడ్డు ప్రమాదం జీప్ ఢీకొని వ్యక్తికి గాయాలు!

Penamaluru: కానూరు గ్రామం, సత్య రెసిడెన్సీ లో నివాసముంటున్న అరిగే గంగాధరరావు తండ్రి వేంకటేశ్వరరావు, వయస్సు 36 yrs అనే వ్యక్తి G.R. కిరణ్ నడుపుతున్న AP40KL6244 రిజిస్ట్రేషన్ నంబర్ గల రాపిడో బైక్‌పై ది 06/08/2026 వ తేదీ రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా, సుమారు 03:15 గంటల సమయంలో తాడిగడప 100 ఫిట్ రోడ్ లోని SVN కన్వెన్షన్ వద్దకు చేరుకోగానే AP39SF2222 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన జీప్ కారును ఒక మహిళ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ వచ్చి వీరి రాపిడో బైక్‌ను పక్కన బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఫిర్యాదుదారుడు కిందపడిపోవడంతో ఆయన కుడిచేయి, కుడికాలికీ తీవ్ర గాయాలయ్యాయి, అలాగే పక్కటెముకల వద్ద గాయాలు కాగా అతనిని చుట్టుపక్క వాళ్ళు హాస్పిటల్కి తరలించారు. ఫిర్యాదు ఈరోజు పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేసినారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story