NTR: రగడ: రూ.43 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయానికి తాళం!

NTR: ఎన్టీఆర్ జిల్లా కొణతాలపల్లి సచివాలయానికి తాళం. రూ.43 లక్షలతో నిర్మించిన భవనం నుండి సామాగ్రి తరలింపుపై వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం!

Naresh, Nandigama
Published on: 30 July 2026 11:21 AM IST
NTR
X

NTR: రగడ: రూ.43 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయానికి తాళం!

ఎన్టీఆర్ జిల్లా నందిగామ:

వీరులపాడు మండలం కొణతాలపల్లి గ్రామంలో గ్రామ సచివాలయానికి తాళం వేసిన అధికారులు, అధికార పార్టీ మండల అధ్యక్షుడు...

కొణతాలపల్లి గ్రామంలో గత ప్రభుత్వంలో 43 లక్షల రూపాయలతో సచివాలయం నిర్మించారు...

నందిగామ నియోజకవర్గంలో రెండోవ సచివాలయం గా ప్రారంభించారు గత మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు...

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరులపాడు మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కొండ్రగుంట శ్రీనివాసరావు తన సొంత గ్రామం అయినా కొణతాలపల్లి లో వినూత్న రీతిలో ఆలోచన చేశారని అన్నారు గ్రామ ప్రజలు గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్మించిన సచివాలయం దగ్గరకు నేను ఎందుకు వెళ్ళాలి నా ఇంటి ముందు ఉన్న పంచాయతీ కార్యాలయంలో సచివాలయం సిబ్బంది వర్క్ చేస్తే ఉంటే బాగుంటుందని ట్రాక్టర్ తో సచివాలయంలో సామాగ్రి మొత్తం వీరులపాడు మండల తరలించడాని తెలిపారు ప్రతిపక్ష నాయకులు...

ప్రజల కట్టిన పన్నులతో నిర్మించిన సచివాలయానికి తాళం వేసి ఎందుకు పనికి రాకుండా చేస్తున్నాడు తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు కొండ్రగుంట శ్రీనివాస రావు అని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు...

వీరులపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి (MDO) వివరణ అడుగగా మాకు ఏమి తెలియదు మమ్మల్ని అడగవద్దని, ఎక్కడ సచివాలయ సిబ్బంది కూర్చుని సేవలందిస్తారని విన్నూత్న సమాధానం చెప్పారు...

Naresh, Nandigama

Naresh, Nandigama

Next Story