Tadigadapa: రోడ్డు విస్తరణ బాధితులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ భరోసా
Tadigadapa: తాడిగడప మహానాడు రోడ్డు విస్తరణ బాధితులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధైర్యం చెప్పారు. రైతుల విజ్ఞప్తి మేరకు 1:4 నిష్పత్తిలో టీడీఆర్ బాండ్లు ఇప్పిస్తామన్నారు.
Tadigadapa: రోడ్డు విస్తరణ బాధితులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ భరోసా
తాడిగడప: మహానాడు 100 అడుగుల రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు స్పష్టం చేశారు. రైతుల హక్కులను కాపాడటమే తమ తొలి ప్రాధాన్యత అని,అభివృద్ధికి రైతులు అడ్డంకి కాదని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.
గతంలో నిర్ణయించిన 1:2 నిష్పత్తికి బదులుగా రైతుల విజ్ఞప్తి మేరకు 1:4 నిష్పత్తిలో TDR బాండ్లు మంజూరు చేయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అర్హులైన రైతులకు రాబోయే 4 నెలల్లో TDR బాండ్లు ఇప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. రైతులకు నమ్మకం కలిగించి,సమస్యలు పరిష్కరించిన తర్వాతే రోడ్డు పనులను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.
సర్వే,రోడ్డు మార్కింగ్‌లో తేడాలు ఉన్న ప్రాంతాలు,సర్వే నంబర్ 98/2 పుంత పోరంబోకు స్థలాల్లో సాగులో ఉండి పట్టాలు కలిగిన రైతుల సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 77 మంది బాధిత రైతుల సమస్యలను పరిశీలించి,పెండింగ్‌లో ఉన్న ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అధికారుల నిర్లక్ష్యాన్ని మాత్రం సహించేది లేదు
నిర్దేశించిన గడువులోగా రైతులకు బాండ్లు అందించకపోతే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు అధికారులను హెచ్చరించారు. రైతు ప్రయోజనం ముందు...అభివృద్ధి తర్వాత! రైతులకు న్యాయం చేస్తూనే మహానాడు రోడ్డు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.




