Tadigadapa: వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన వీరబాబు!
Tadigadapa: తాడిగడప మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున శ్రీ యార్లగడ్డ వీరబాబు నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Tadigadapa: వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన వీరబాబు!
తాడిగడప: తాడిగడప మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ యార్లగడ్డ వీరబాబును ఎంపిక చేసినట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు, పార్టీ నాయకులు, స్థానిక పార్టీ శ్రేణుల సమిష్టి నిర్ణయం మేరకు వీరబాబును అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శుభదినం కావడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. గౌడ సామాజిక వర్గానికి చెందిన యార్లగడ్డ వీరబాబుకు స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. గతంలో పంచాయతీ సభ్యుడిగా, ఎంపీటీసీ స్థాయిలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని పేర్కొన్నారు. యలమకుదురు సహా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు గ్రామాల ప్రజలకు ఆయన సుపరిచితుడని చెప్పారు.
అనంతరం చైర్మన్ అభ్యర్థి యార్లగడ్డ వీరబాబు మాట్లాడుతూ.. గతంలో పంచాయతీ బోర్డు సభ్యుడిగా పనిచేసిన అనుభవంతో స్థానిక సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, రహదారులు, గృహ కనెక్షన్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కొత్తగా ఏర్పడిన తాడిగడప మున్సిపాలిటీని సమష్టి కృషితో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న చైర్మన్ అభ్యర్థితో పాటు 48 మంది కౌన్సిలర్ అభ్యర్థులకు ప్రజలు తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ విజయం అందించాలని విజ్ఞప్తి చేశారు.




