Tadigadapa: తాడిగడప నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్!

Tadigadapa: తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పలు డివిజన్లలో కూటమి అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమాల్లో పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ ఆదివారం పాల్గొన్నారు.

Ramana, Penamaluru
Published on: 15 Nov 2026 5:32 PM IST
Tadigadapa
X

Tadigadapa: తాడిగడప నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్!

తాడిగడప: తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యంలో పలు డివిజన్లలో కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమాలకు పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో కలిసి నామినేషన్ ప్రక్రియలో పాల్గొని,వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

స్థానిక నాయకులు,పార్టీ శ్రేణులు,కార్యకర్తలతో సమావేశమై ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించారు,డివిజన్ల వారీగా ఎన్నికల కార్యక్రమాలు,నామినేషన్ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru