Penamaluru: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ఖాయం!
Penamaluru: పెనమలూరులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కీలక నేతల సమావేశం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు.
Penamaluru: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ఖాయం!
Penamaluru: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేసి,సమన్వయంతో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ఈరోజు పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారి కార్యాలయంలో కీలక కూటమి నాయకుల సమావేశం జరిగింది...
ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు,జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ వీరంకి గురుమూర్తి గారు,అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ బుద్ధ ప్రసాద్ గారు,పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు,జిల్లా పరిశీలకులు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారు,జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ తాతినేని శ్రీరామ్ గారు,శ్రీ కుమార్ స్వామి గారు,జనసేన నాయకులు శ్రీ బండి రామకృష్ణ గారు,శ్రీ చిలకలపూడి పాపారావు గారు,తదితరులు పాల్గొన్నారు...
పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు… మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ వరకు ప్రతి స్థాయిలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు...
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అభివృద్ధి–సంక్షేమాన్ని కొనసాగిస్తూ సువర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే మన అందరి సంకల్పం...




