Nandigama: సీఐ వైవిఎల్ నాయుడు ముందే ఘర్షణ.. టీడీపీ నేత పరిటాల రాముకు గాయాలు

Nandigama: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.

Naresh, Nandigama
Published on: 19 Jun 2026 12:46 PM IST
Nandigama
X

Nandigama: సీఐ వైవిఎల్ నాయుడు ముందే ఘర్షణ.. టీడీపీ నేత పరిటాల రాముకు గాయాలు

నందిగామ: రూరల్ సీఐ వైవిఎల్ నాయుడు ఎదురుగా ఉన్న కొట్టుకున్నా తెలుగు తమ్ముళ్లు కంచికచర్ల మండలం కీసర గ్రామంలో తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య కుమ్ములాట ఘర్షణ వాతావరణం. టోల్ గేట్ వద్ద హైవే కు అడ్డంగా ఉన్న ఆక్రమణ తొలగింపు విషయంలో తలెత్తిన వివాదంలో కీసర గ్రామంలోని తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాలకు సంబంధించిన నాయకులు మధ్య ఘర్షణ.

ఈ ఘటనలో తెలుగుదేశం నాయకులు ఇరువురు ఘర్షణ పడగా పరిటాల రాము అనే తెలుగుదేశం నాయకుడికి గాయాలు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. పరిటాల రాము అనే నాయకుడు గతంలో వైకాపా పార్టీలో క్రియాశీ ల నాయకుడిగా ఉన్నత పదవులు పొంది వైకాపా ఓటమి తో తెలుగుదేశం పార్టీలోకి చేరారు.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి ఉన్న టిడిపి నాయకులకి సరైన గౌరవం దక్కపోవటంతో అసంతృప్తితో ఉన్నటిడిపి మరో వర్గం కక్ష సాధింపు చర్యలో భాగంగా వైకాపా పార్టీల నుంచి టిడిపి పార్టీలోకి చేరిన పరిటాల రాము గ్రామంలో పెత్తనం చెలాయించడం తో కక్ష సాధింపు చర్యలకు తెరలేపారు టిడిపి మరో వర్గం. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన కంచికచర్ల పోలీసులు.

Naresh, Nandigama

Naresh, Nandigama

Next Story