Nandigama: నందిగామలో ఉద్రిక్తత వైకాపా అభ్యర్థి కిడ్నాప్ కలకలం!

Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్తత. వైకాపా మహిళా కౌన్సిలర్ అభ్యర్థి కిడ్నాప్, బలవంతపు విత్ డ్రా ఆరోపణలు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ నిరసన!

Naresh, Nandigama
Published on: 21 Oct 2026 6:12 PM IST
Nandigama
X

Nandigama: నందిగామలో ఉద్రిక్తత వైకాపా అభ్యర్థి కిడ్నాప్ కలకలం!

Nandigama: పట్టణంలో 8వ వార్డుకు చెందిన వైకాపా మహిళా కౌన్సిలర్ అభ్యర్థి యర్రబడి అంజలి 8 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసినప్పటి నుంచి కూటమి నాయకులు విత్ డ్రా చేసుకోవాలని పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆమెను కిడ్నాప్ చేసి టిడిపి నాయకులు బలవంతంగా నామినేషన్ సెంటర్ వద్దకు తీసుకువచ్చి నామినేషన్ను విత్ డ్రా చేయించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

సమాచారం తెలుసుకున్న ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ నామినేషన్ సెంటర్ వద్ద చేరుకొని జరిగిన విషయంపై అధికారులను నిలదీశారు.

దీంతో నామినేషన్ సెంటర్ వద్ద టిడిపి నాయకులు గందరగోళ వాతావరణాన్ని సృష్టించి వైకాపా నాయకుల్ని నామినేషన్ సెంటర్ నుంచి బయటికి నెట్టి వేయడంతో ఉధృత వాతావరణం నెలకొంది.

ఓటమి భయంతో వైకాపా అభ్యర్థుల్ని కిడ్నాప్ చేసి బలవంతంగా విత్ డ్రా చేయించడం సరికాదని అన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్.

ఎన్నికల నామినేషన్ సెంటర్ లో ఉన్న సిసి ఫుటేజ్ ని బహిర్గతం చేసి న్యాయ విచారణ చేపట్టి దౌర్జన్యం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు

Naresh, Nandigama

Naresh, Nandigama