Tiruvuru: ఈ నెల 27న టిడ్కో ఇళ్ల పరిశీలన ఎమ్మెల్యే కొలికపూడి!

Tiruvuru: తిరువూరులో టిడ్కో ఇళ్ల పంపిణీకి శ్రీకారం. ఈ నెల 27న లబ్ధిదారులకు ఇళ్లను చూపిస్తామని వెల్లడించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.

Venkateswara Rao, Tiruvuru
Published on: 18 Sept 2026 1:43 PM IST
Tiruvuru
X

Tiruvuru: ఈ నెల 27న టిడ్కో ఇళ్ల పరిశీలన ఎమ్మెల్యే కొలికపూడి!

Tiruvuru: తిరువూరు పట్టణంలోని రెండో వార్డులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయో వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను వారి ఇళ్ల వద్దకు తీసుకువెళ్లి, వారికి కేటాయించిన ప్లాట్లు, నిర్మాణాలను స్వయంగా చూసుకునేలా అవకాశం కల్పిస్తామని తెలిపారు. అతి త్వరలో లబ్ధిదారులకు ఇళ్లను అందజేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

తిరువూరు పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని వివరించారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కోరారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru