Tiruvuru: తిరువూరులో ఘనంగా తిరంగా ర్యాలీ ప్రారంభించిన ఆర్డీవో

Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఆర్డీవో జెండా ఊపి ప్రారంభించారు.

Venkateswara Rao, Tiruvuru
Published on: 13 Aug 2026 11:25 AM IST
Tiruvuru
X

Tiruvuru: తిరువూరులో ఘనంగా తిరంగా ర్యాలీ ప్రారంభించిన ఆర్డీవో

Tiruvuru: దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరువూరులో తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు.ఆర్డీవో జాతీయ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, దేశం స్వాతంత్ర్యం సాధించి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ చారిత్రాత్మక సందర్భంగా ప్రతి పౌరుడు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని, వారు దేశభక్తి భావంతో పాటు క్రమశిక్షణ, నిజాయితీ వంటి విలువలను అలవర్చుకుని మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.

స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను తెలుసుకుని వారి ఆదర్శాలను ఆచరణలో పెట్టాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాలు చేతపట్టి దేశభక్తి నినాదాలతో వాతావరణాన్ని దేశభక్తిమయం చేశారు.

ర్యాలీలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని "భారత్ మాతా కీ జై" నినాదాలతో జాతీయ భావాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ డీ.చంద్రమౌళి, మున్సిపల్ కమిషనర్ మనోజ, డివైఓ శ్యాంసుందర్, ఎస్సైలు శాతకర్ణి, గౌరీశ్వరి పాల్గొన్నారు.

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru

Next Story