Penamaluru: అధిక లోడుతో వెళ్తున్న రెండు ఇసుక లారీలు సీజ్!

Penamaluru: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆదేశాలతో స్పందించిన అధికారులు. నిబంధనలు ఉల్లఘించిన రెండు ఇసుక లారీలు సీజ్.

Ramana, Penamaluru
Published on: 1 Oct 2026 12:56 PM IST
Penamaluru
X

Penamaluru: అధిక లోడుతో వెళ్తున్న రెండు ఇసుక లారీలు సీజ్!

Penamaluru: కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో చోడవరం నుంచి పెనమలూరు వైపు వస్తున్న ఇసుక లారీలను పోలీసులు అడ్డుకున్నారు. గత ఆరు నెలలుగా అక్రమంగా, అధిక లోడుతో ఇసుక తరలిస్తున్న లారీలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ డిమాండ్. ఎమ్మెల్యే ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఇసుక లారీలను తనిఖీ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్లు గుర్తించిన రెండు లారీలపై కేసులు నమోదు. కేసులు నమోదు చేసిన అనంతరం రెండు లారీలను పెనమలూరు ఎమ్మార్వో కార్యాలయానికి తరలించిన పోలీసులు. అధిక లోడుతో ఇసుక రవాణాపై ఇకపై కఠిన చర్యలు ఉంటాయా? అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ఫిర్యాదుపై అధికారులు స్పందించడంతో అక్రమ ఇసుక రవాణాదారుల్లో కలకలం.

Ramana, Penamaluru

Ramana, Penamaluru