Uyyuru: ఉయ్యూరు ఆర్టీసీ డిపోలో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు
Uyyuru: కృష్ణా జిల్లా ఉయ్యూరు ఆర్టీసీ డిపోలో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు. నవంబర్ 1 నుంచి 7 వరకు పర్యావరణ పరిరక్షణ, యోగా, ఇంధన సంరక్షణపై అవగాహన.
Uyyuru: ఉయ్యూరు ఆర్టీసీ డిపోలో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు
ఉయ్యూరు: APSRTC ఉయ్యూరు డిపోలో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు (BRICS Sustainable Lifestyle Week–2026) కార్యక్రమాలను నవంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి, సహజ వనరుల సంరక్షణపై ఉద్యోగుల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమంలో భాగంగా *మొదటి రోజు ఉద్యోగులకు యోగా కార్యక్రమాన్ని నిర్వహించి, యోగా ప్రాముఖ్యత, శారీరక ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతతకు యోగా వల్ల కలిగే ప్రయోజనాలపై* అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయడంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
*రెండవ రోజు ఇంధన సంరక్షణ ప్రాముఖ్యతపై* ఉద్యోగులకు అవగాహన కల్పించారు. అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయడం, ఎల్ఈడీ బల్బులను వినియోగించడం, సహజ కాంతిని ఉపయోగించుకోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మరియు రైల్వే క్రాసింగ్‌ల వద్ద అనవసరంగా వాహన ఇంజిన్లను ఆన్‌లో ఉంచకుండా ఉండటం వంటి ఇంధన పొదుపు చర్యలను పాటించాలని సూచించారు. ఇంధన వనరులను ఆదా చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని వివరించారు.
వారోత్సవాల్లో భాగంగా రాబోయే రోజుల్లో నీటి సంరక్షణ, ఆహార వృథా నివారణ, చిరుధాన్యాలు మరియు సంప్రదాయ ఆహార వినియోగం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, ఈ-వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల తగ్గింపు వంటి అంశాలపై నిర్దేశిత కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఉద్యోగులందరూ ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, సుస్థిర జీవనశైలి అలవాట్లను తమ దైనందిన జీవితంలో పాటిస్తూ పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ఉయ్యూరు డిపో మేనేజర్ కోరారు.




