Uyyuru: ఉయ్యూరు 4వ వార్డులో కూటమి ప్రచార హోరు: రంగంలోకి బోడే వెంకట్రామ్
Uyyuru: ఉయ్యూరు మున్సిపాలిటీ 4వ వార్డులో కూటమి కౌన్సిలర్ అభ్యర్థి కనగాల నాగమణి విజయాన్ని కాంక్షిస్తూ యువ నాయకుడు బోడే వెంకట్రామ్ విస్తృత ప్రచారం చేశారు.
Uyyuru: ఉయ్యూరు 4వ వార్డులో కూటమి ప్రచార హోరు: రంగంలోకి బోడే వెంకట్రామ్
Uyyuru: ఉయ్యూరు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఉయ్యూరు మున్సిపాలిటీలోని 4వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి శ్రీమతి కనగాల నాగమణి గారి విజయాన్ని కాంక్షిస్తూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారి తనయుడు,పెనమలూరు నియోజకవర్గ యువ నాయకుడు శ్రీ బోడే వెంకట్రామ్ గారు కూటమి నాయకులు,కార్యకర్తలతో కలిసి వార్డులోని ప్రజలను ఆప్యాయంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు, ఉయ్యూరు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరిస్తూ,ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం,స్థానిక సమస్యలకు పరిష్కారం చూపడం,అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయడం కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలని తెలిపారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉయ్యూరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కూటమికి అండగా నిలవాలని నాయకులు కోరారు వార్డుల అభివృద్ధి,ప్రజలకు మెరుగైన సేవలు,పారదర్శక పాలన లక్ష్యంగా కూటమి అభ్యర్థులు పనిచేస్తారని భరోసా ఇచ్చారు.




