Vuyyuru: సోషల్ మీడియా పవర్..తప్పిపోయిన వృద్ధుడి ఆచూకీ లభ్యం!
Vuyyuru: ఉయ్యూరులో తప్పిపోయిన 80 ఏళ్ల తాబేటి యోహాన్ 12 గంటల వ్యవధిలోనే క్షేమంగా లభ్యం. సోషల్ మీడియా ప్రచారం, పోలీసుల చొరవతో ఊపిరి పీల్చుకున్న బంధువులు.
Vuyyuru: సోషల్ మీడియా పవర్..తప్పిపోయిన వృద్ధుడి ఆచూకీ లభ్యం!
Vuyyuru: సోషల్ మీడియా ప్రచారంతో వృద్ధుడి ఆచూకీ లభ్యం..! ఉయ్యూరులో తప్పిపోయిన 80 ఏళ్ల తాబేటి యోహాన్ క్షేమంగా లభ్యం..! శుభకార్యానికి భోళ్ళపాడు నుంచి ఉయ్యూరు వచ్చిన మోహన్.. KCP కాలనీ నుంచి ఇంటికి బయలుదేరి కనిపించకుండా పోయారు.
బంధువులు, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో సోషల్ మీడియాలో ఫొటో, వివరాలతో విస్తృత ప్రచారం చేశారు. ఉయ్యూరు సీఐ టీవీవీ రామారావు పర్యవేక్షణలో టౌన్ ఎస్ఐ మల్లికాసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.
సోషల్ మీడియా ప్రచారం ద్వారా సమాచారం అందడంతో చివరకు తాబేటి యోహాన్ ఆచూకీ లభించింది. సోషల్ మీడియా ప్రచారం ఓ కుటుంబాన్ని ఆందోళన నుంచి బయటపడేసింది..! కేవలం 12 గంటల వ్యవధిలోనే సోషల్ మీడియా ప్రచారం ద్వారా ఆచూకీ లభించింది. పోలీసుల సమయస్ఫూర్తి, చొరవకు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.




