Uyyuru: రూ.98 కోట్లతో మంచినీటి ప్రాజెక్ట్ – కూటమి సమావేశంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్

Uyyuru: రూ.98 కోట్లతో కృష్ణా నది తాగునీటి ప్రాజెక్టు శంకుస్థాపన, రూ.18 కోట్లతో అభివృద్ధి పనులు వెల్లడించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్.

Ramana, Penamaluru
Published on: 23 Aug 2026 11:34 PM IST
Uyyuru
X

Uyyuru: రూ.98 కోట్లతో మంచినీటి ప్రాజెక్ట్ – కూటమి సమావేశంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్

ఉయ్యూరు: ఉయ్యూరు మండలం ఉయ్యూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు,మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్రప్రసాద్ గారు పాల్గొన్నారు,సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సంసిద్ధం చేయడం,పార్టీని మరింత బలోపేతం చేయడం,అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా ఈ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

గత రెండున్నర సంవత్సరాలుగా ఉయ్యూరు మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు,భవిష్యత్తులో చేపట్టబోయే పనుల గురించి కార్యకర్తలకు,ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా కృష్ణా నది నీటిని తోట్లవల్లూరు కృష్ణానది నుంచి ఉయ్యూరు మున్సిపాలిటీకి తీసుకురావడానికి రూ.98 కోట్లతో చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి,పైపుల ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియ కూడా పూర్తయింది,రేపు మంగళవారం ఉదయం 10:30 గంటలకు మన పార్లమెంటు సభ్యులు శ్రీ బాలశౌరి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేసుకుంటున్నాం అన్నారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉయ్యూరు నగర ప్రజలకు కృష్ణా నది తాగునీరు అందుబాటులోకి రానుంది,ప్రజల చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందన్నారు.

హ్యాండ్ పథకం కింద ఉయ్యూరు మున్సిపాలిటీకి రూ.18 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది, ఈ నెల 22వ తేదీన టెండర్లు పిలవబోతున్నాం. మున్సిపాలిటీలోని రోడ్లు,డ్రైనేజీలు,ఇతర మౌలిక వసతులకు సంబంధించిన పనులను ఈ నిధులతో చేపట్టబోతున్నాం.

అలాగే టిడ్కో హౌసింగ్ లబ్ధిదారులకు ఇళ్లను అందించే కార్యక్రమం కూడా ముందుకు సాగుతోంది,దాదాపు ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి,రోడ్లు,డ్రైనేజీ వంటి మౌలిక వసతుల పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇళ్లను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం,లబ్ధిదారులను అక్కడికి తీసుకెళ్లి టిడ్కోఇళ్లను చూపించి,వారికి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.

గత ఐదు సంవత్సరాల వైకాపా ప్రభుత్వ పాలనలో ఉయ్యూరులో టిడ్కోఇళ్లను పక్కన పెట్టడం,విద్యుత్ సమస్యలను పరిష్కరించకపోవడం వంటి అనేక సమస్యలు పేరుకుపోయాయి,ఉయ్యూరుకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం అవసరమైన విద్యుత్ సబ్‌స్టేషన్‌కు నిధులు మంజూరైనా,గత ప్రభుత్వం పనులు పూర్తి చేయడంలో విఫలమైంది.

గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ అభివృద్ధి వైపు ఉయ్యూరును తీసుకువెళ్తున్నామని స్పష్టం చేశారు.

అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి,గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతో పాటు,కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి,అందిస్తున్న సంక్షేమం,చేపడుతున్న భవిష్యత్ ప్రణాళికలను ప్రతి ఇంటికీ చేరవేయాలి.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గ్రూపులు,వర్గ విభేదాలకు తావులేకుండా ఐక్యంగా పనిచేసి, తెలుగుదేశం పార్టీ–కూటమి అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రేపు జరిగే రూ.98 కోట్ల కృష్ణా నది తాగునీటి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి ఉయ్యూరు నగర ప్రజలు,తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story