Vanukuru: డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

Vanukuru: వణుకూరులో పర్యటించి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన కలెక్టర్ డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Ramana, Penamaluru
Published on: 22 Sept 2026 11:33 PM IST
Vanukuru
X

Vanukuru: డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

వణుకూరు: పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్‌తో కలిసి ఆయన గ్రామంలో పర్యటించి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు.

గ్రామంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేలా అవసరమైన డ్రైనేజీ పనులకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు.

డ్రైనేజీలను ఏ ప్రాంతాల్లో, ఏ విధంగా ఏర్పాటు చేయాలనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చేపట్టాల్సిన పనులన్నింటినీ ప్రతిపాదనల్లో పొందుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతిపాదనలను సిద్ధం చేసి అనుమతుల కోసం సమర్పించాలని, నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ పర్యటనలో పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ పీవీ రమణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru