Tadepalli: వైయస్ జగన్‌ను కలిసిన వేమూరు విద్యార్థులు
Tadepalli: యూకేలో ఉన్నత విద్యకు వెళ్తున్న వేమూరు విద్యార్థులు వైయస్ జగన్‌ను కలిశారు. విద్యార్థులను అభినందించి, మంచి భవిష్యత్తు ఉండాలని జగన్ ఆకాంక్షించారు.
Tadepalli: వైయస్ జగన్‌ను కలిసిన వేమూరు విద్యార్థులు
తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌ను బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన విద్యార్థులు కలిశారు. నేషనల్ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద తాము యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళుతున్నట్లు విద్యార్థులు శ్రీ వైయస్ జగన్‌కు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన శ్రీ వైయస్ జగన్, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతమైన విద్యనభ్యసించాలని సూచించారు. చదువులో ప్రతిభ కనబరిచి, భవిష్యత్తులో సమాజానికి మేలు చేసే ఉన్నత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వారి ఉన్నత విద్యాభ్యాసం విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.
వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యావ్యవస్థలో చేపట్టిన కార్యక్రమాలు తమలాంటి అనేక మంది విద్యార్థులకు అవకాశాలు కల్పించాయని విద్యార్థులు శ్రీ వైయస్ జగన్‌తో పేర్కొన్నారు. తమ జీవితాల్లో మెరుగైన భవిష్యత్తుకు మార్గం ఏర్పడటంలో ఆ సమయంలో విద్యారంగంలో తీసుకున్న చర్యలు ఉపయోగపడ్డాయని వారు తెలిపారు. తమకు వరికూటి అశోక్‌బాబు కుమారుడు గౌతమ్ గైడ్ చేయడం ద్వారా ఈ సీట్లు సాధించామని విద్యార్ధులు అన్నారు, పేద విద్యార్ధులకు ఉన్నత విద్య అందేలా సహాయం చేసిన గౌతమ్‌ను వైయస్ జగన్ అభినందించారు.
వేమూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో శ్రీ వైయస్ జగన్‌ను కలిసిన విద్యార్థుల్లో నడకుర్తి అలెగ్జాండర్, వేణు వాసుమల్ల, మూల్పూరు ప్రసన్నకుమారి, నీరజా భూపతి, రోహిత్ వాసుమల్ల ఉన్నారు.




