Vijayawada: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం!
Vijayawada: విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి మేయర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.
Vijayawada: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం!
Vijayawada: విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ వంగవీటి రాధ శనివారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మేయర్ వంగవీటి రాధ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో నెలకొన్న అసమానతలు, అంటరానితనం, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్య, సమాన హక్కుల సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
మహిళలకు విద్య అందించడం ద్వారా సమాజంలో సమూల మార్పు తీసుకురావచ్చని విశ్వసించి, మహిళా విద్యాభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. విద్య ద్వారానే సామాజిక చైతన్యం, సమానత్వం సాధ్యమవుతాయని చూపిన మార్గం నేటి తరాలకు కూడా ఆదర్శప్రాయమని అన్నారు.మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, విద్యాభివృద్ధి సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేయర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో 51 వ వార్డ్ కార్పొరేటర్ అబ్దుల్ అఖీబ్ అర్షద్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గ్లోరీ, పాల్గొన్నారు.




