Kanchikacherla: అధికార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుంది: గూడవల్లి గణేష్!

Kanchikacherla: కంచికచర్ల కూటమి సర్పంచ్ అభ్యర్థి గూడవల్లి గణేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎమ్మెల్యే సౌమ్య సహకారంతో రూ.4 కోట్లతో తాగునీటి సమస్య తీరుస్తామన్నారు.

Naresh, Nandigama
Published on: 22 Nov 2026 9:53 PM IST
Kanchikacherla
X

Kanchikacherla: అధికార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుంది: గూడవల్లి గణేష్!

నందిగామ: కంచికచర్ల పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరుపున పోటీ చేస్తున్న గూడవల్లి గణేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ సర్పంచ్ అభ్యర్థి గూడవల్లి గణేష్ మాట్లాడుతూ... అధికార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కంచికచర్ల ప్రజలు రుజువు చేశారు.

కంచికచర్ల పట్టణంలో అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయి వాటిలో ముఖ్యంగా తాగునీరు సమస్య నాకు తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సహకారం 4 కోట్ల రూపాయలతో శాశ్వతంగా మంచినీటి సమస్యను పరిష్కరించడానికి.

-కట్టుదిట్టమైన చర్యలు మా ప్రభుత్వం ద్వారా తీసుకుంటామని తెలిపారు సర్పంచ్ అభ్యర్థి గూడవల్లి గణేష్. నాతో పాటు కంచికచర్ల కూటమి ప్రభుత్వం తరఫున పోటీ చేస్తున్న వార్డు నెంబర్లను అందరిని గెలిపించాలని కోరారు గూడవల్లి గణేష్.

Naresh, Nandigama

Naresh, Nandigama