Nandigama: తీవ్ర కలకలం..టీడీపీ వేధింపులతో మహిళ ఆత్మహత్య!

Nandigama: టీడీపీ వేధింపుల వల్ల రమాదేవి అనే మహిళ ఆత్మహత్య చేసుకుందని, దీనికి పోలీసుల అక్రమ కేసులే కారణమని వైసీపి మాజీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ఆరోపించారు.

Naresh, Nandigama
Published on: 25 July 2026 10:15 PM IST
Nandigama
X

Nandigama: తీవ్ర కలకలం..టీడీపీ వేధింపులతో మహిళ ఆత్మహత్య!

నందిగామ: నందిగామలో మొన్న తోటకూర సూర్యనారాయణ ఆత్మహత్యాయత్నం ఘటన మరువకముందే. నేడు తెలుగుదేశం పార్టీ వేధింపులకు బెల్లంకొండ వారి పాలెం లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు. చిగురుపాటి రమాదేవి ఆత్మహత్యకు ఏం సమాధానం చెబుతారు ??... ఆమెను బలి తీసుకున్నది ఎవరు ??... ఇది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ చేసిన హత్య... తన కొడుకు ను వేధిస్తుంటే చూడలేక ఆ తల్లి తన ప్రాణం తీసుకుంది .

తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడి సోదరుడి కుమార్తె - సదరు యువకుడుని ప్రేమించి - ఇద్దరు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకునేందుకు వెళ్లిపోతే... పోలీసులు సదరు జంట ను పట్టుకొని... ఆ జంటను విడదీశారు... అప్పుడు ఆ యువకుడిని వేధించడానికి అధికార అహంతో ఆ యువకుడిపై దొంగతనం కేసు పెట్టారు.

స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో ఆ పట్టణ పార్టీ అధ్యక్షుడు పరువు కోసం ఆ యువకుడిని పలు రకాలుగా వేధించడం... పోలీసులతో కొట్టించడం... కనీసం పిల్లను పోలీస్ స్టేషన్ కు తేకుండా.. వేరువేరు తప్పుడు కేసులు పెట్టి... దొంగతనం ఆపాదించి.. ‌ ఆ జంట ఖర్చు చేసుకున్న డబ్బులు కూడా... వసూలు చేయాలనుకొని... డబ్బులు తేవాలని ఒత్తిడి చేశారు...

నేను మహిళను చాలా పెద్ద మనసుతో - చాలా చాలా పెద్ద మనసుతో మహిళల పట్ల ఉంటాను... అని అప్పుడు మాట్లాడిన సదరు ప్రజాప్రతినిధి... ఇప్పుడు చనిపోయిన మహిళకు ఏం సమాధానం చెబుతారు ??... ఈ మహిళను ఆత్మహత్యకు పురిగొల్పింది ఎవరు ??... ఇలా ఎంతమందిని బలి తీసుకుంటారు ??...*

ఒక ప్రజాప్రతినిధి ఏం చేయాలి ! వారు ప్రేమించుకున్నారు - విషయం మీ దాకా వచ్చింది - మీరు పెద్ద వారిలా వారిని కూర్చోబెట్టి మాట్లాడాలి - ఇది ఇది అని చెప్పాలి - వారికి ఇష్టమైతే పెళ్లి చేయాలి - లేకపోతే మంచి చెప్పి వేరు చేయాలి - ఇవేమీ లేకుండా కేవలం అధికారం ఉందనే అండతో... వారిద్దరూ అగ్రవర్ణాలైనా - ఆ యువకుడు ఆర్థికంగా బలహీనుడు అవటంతో... పరువు కోసం అతన్ని వేదించటం మొదలుపెట్టారు...

ఒక ప్రేమ కథలో వేలు పెట్టడం - ఆ జంటను విడదీయడం - ఆ యువకుడిని వేధించటం - కేసులు పెట్టడం - కొట్టడం - హైకోర్టు దాకా ఈ కేసు వెళ్లడం... ఇవన్నీటికి కారణం ఎవరు ??.. ఇవన్నీ చూసి ఆ యువకుడు మనోవేదనతో... సదరు గ్రామ నాయకుడితో విభేదించడం... ఆ గ్రామ నాయకుడు - సదరు పట్టణ అధ్యక్షుడికి అండగా ఉన్నాడని --... గ్రామస్తులైన మా వైపు కాకుండా -- వేధించే వారికి తోడు నిలవడాన్ని ఆ యువకుడు ప్రశ్నించటం జరిగింది...

ప్రేమించిన పాపానికి... ఆ యువకుడి తల్లిని బలి తీసుకుంటారా ... ప్రేమిస్తే వారిద్దరికి ఇష్టమైతే - పెద్ద మనసుతో పెళ్లి చేయాలి ! లేకపోతే ఇద్దరికి సర్దిచెప్పి మంచిగా వేరు చేయాలి !... అంతేకానీ ఆ తల్లిని బలి తీసుకుంటారా... తన కొడుకును తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు అధికారంతో నిత్యం వేధిస్తుంటే చూడలేక ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది...

సదరు మహిళా తెలుగుదేశం పార్టీ కాదా.. సదరు మహిళ కొడుకు తెలుగుదేశం పార్టీ కాదా ??.. ప్రేమించిన యువతి కుటుంబం తెలుగుదేశం పార్టీ కాదా ??.. ఇప్పుడు చావు కారణం తెలుగుదేశం పార్టీ కాదా ??.. మొన్న ఆత్మహత్యకు యత్నించిన తోటకూర సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీ కాదా ??.. ఒక పట్టణ అధ్యక్షుడి కోసం ---- ఇలా ఎంతమందిని మీరు ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తారు ??..*

అసలేం రాజకీయాలు ఇవి ??.. అసలు ఏం అధికారం ఇది ??.. ఇది మా కుటుంబ విషయం అంటారు !! ఆత్మహత్యలు చేసుకోవడం - ఆత్మహత్య చేసుకునేలా వారిని వేధించటం - కుటుంబ విషయమా ??.. మేము మాట్లాడితే శవ రాజకీయాలు అంటారు !! వారిని శవాలుగా తయారు చేస్తుంది మీరు !!.. బలి తీసుకుంటుంది మీరు !!... ఇది ముమ్మాటికి అధికార హత్య...

ఆ పట్టణ అధ్యక్షుడు ఎంతటి మొనగాడు అంటే !!... చేతకానితనంతో శిలాఫలకాలు పగలగొట్టేంత ధీరుడు !!... ఇప్పుడు ఒక బీసీ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి కారణం అయ్యాడు !! ఒక మహిళ ఆత్మహత్యకు కారణమయ్యాడు !!.. ఇలాంటివారినా మీరు సమర్ధించేది !! ఇలాంటి వారినా మీరు వెనుకొసుకోచ్చేది ??...

అటువంటి పట్టణ అధ్యక్షుడిని సమర్థించే ఆ గ్రామ నాయకుడు -- పెట్టిన కేసు వలన - ఆ యువకుడిని మరలా తిరిగి వేధించటం - ఇవన్నీ ఏంటి ??.. అధికారం ఉంటే రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇలా ఆ తల్లి ఆత్మహత్య చేసుకునేలా చేస్తారా ??.. తండ్రి లేని ఆ పిల్లాడు - తల్లి దగ్గర బతుకుతుంటే - ఆ తల్లిని కూడా బలి తీసుకొని -- ఆ యువకుడికి తల్లి తండ్రి లేనివాడిలా చేశారు !... ఇప్పుడా యువకుడికి దిక్కెవరు ??...

పోలీసులు కూడా... ఇటువంటి విషయాల్లో... జాగ్రత్తగా వ్యవహరించాలి... ఏ తప్పు చేసినా ఎవరిని వదిలిపెట్టిది లేదు !!.. రానున్న రోజుల్లో అన్ని తిరిగి తోడతాం... దేన్ని వదిలిపెట్టిది లేదు... చర్యకు ప్రతి చర్య ఉంటది --... మీరేం తప్పు చేశారో - దాన్ని మీరు కచ్చితంగా అనుభవిస్తారు !!.

Naresh, Nandigama

Naresh, Nandigama

Next Story