Ibrahimpatnam: పోలీసుల సమక్షంలో యూట్యూబర్ నందన విచారణపై విమర్శలు!

Ibrahimpatnam: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో యూట్యూబర్ నందన విచారణ గోప్యతపై విమర్శలు. మీడియా కళ్లుగప్పి ఒకరోజు ముందే విచారణకు హాజరైన వైనం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Sept 2026 9:57 AM IST
Ibrahimpatnam
X

Ibrahimpatnam: పోలీసుల సమక్షంలో యూట్యూబర్ నందన విచారణపై విమర్శలు!

Ibrahimpatnam: మీడియా కళ్ళుకప్పి ఒకరోజు ముందే విచారణ కు హాజరైన యూట్యూబర్ నందన. బాధితులకు సహకరించాల్సిన పోలీసులు నిందితురాలు నందనకు పూర్తి స్థాయిలో సహకరించారన్న వాదనలు. వివరాలు ఏమైనా రాబట్టారా అంటే అది కూడా శూన్యం.

నా భర్తకే తెలుసు నాకేం తెలియదని నందన జవాబు ఇచ్చినట్లు సమాచారం. తిరిగి లండన్ వెళ్ళటానికి అనుమతి కోరినట్లు సమాచారం. తనను నన్ను పంపితే తన భర్తను ఒక నెలలో ఇండియాకు పంపుతానని చెప్పినట్లు పుకార్లు.

పోలీసుల గోప్యత వల్లనే ప్రజలు పలు విధాలుగా చర్చించుకుంటున్నారని గుసగుసలు. ఇంత గోప్యత పాటించిన పోలీసులు కీలక వివరాలు ఏమైనా రాబట్టారా తెలపాలంటున్న బాధితులు. సుబ్రమణ్యం సి ఐ గా బాధ్యతలు చేపట్టిన నాటినుండి కీలక విషయాలలో సైతం గుట్టు చప్పుడు కాకుండా గుటుక్కుమనిపిస్తున్నారంటూ విమర్శలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్