Gannavaram: గన్నవరం మండలం గోపవరపుగూడెంలో నల్లూరి శశికళ విస్తృత ప్రచారం!
Gannavaram: గన్నవరం మండలం గోపవరపుగూడెం వైసీపీ సర్పంచ్ అభ్యర్థి నల్లూరి శశికళ ఆదివారం రాష్ట్ర బీసీ కార్యదర్శి కొలుసు మోహన్ యాదవ్‌తో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.
Gannavaram: గన్నవరం మండలం గోపవరపుగూడెంలో నల్లూరి శశికళ విస్తృత ప్రచారం!
గన్నవరం: గన్నవరం మండలం గోపవరపు గూడెం వైసీపీ సర్పంచ్ అభ్యర్థి నల్లూరి శశికళ విస్తృత ప్రచారం, గ్రామంలో వైసిపి నాయకులు కార్యకర్తలతో ఇంటింటికి విస్తృత ప్రచారం, ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైసిపి రాష్ట్ర బీసీ కార్యదర్శి కొలుసు మోహన్ యాదవ్.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహకారంతో సర్పంచ్ అభ్యర్థిగా మా సతీమణి పోటీ చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో నేను సర్పంచ్ గా మా గ్రామాన్ని ఎంతగానో అభివృద్ధి చేశాను. మా అభివృద్ధిని చూసి గ్రామంలో ప్రజలు మాకు నీరాజనం పలుకుతున్నారు.
ప్రజలందరూ మరోసారి దీవించి ఆశీర్వదిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాను. కత్తెర గుర్తు పై ఓటు వేసి, సర్పంచ్ అభ్యర్థి అయిన మా సతీమణిని, మా ప్యానల్ వాటి సభ్యులను అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను.




