Nandyal: రెండో విడత పల్లెపోరుకు సర్వం సిద్ధం.. బనగానపల్లెలో నేడే పోలింగ్!

Nandyal: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో 12 పంచాయతీలు, 124 వార్డులకు నేడు పోలింగ్ జరగనుంది.

Ramanaiah, Banaganepalle
Published on: 28 Nov 2026 4:55 PM IST
Nandyal
X

Nandyal: రెండో విడత పల్లెపోరుకు సర్వం సిద్ధం.. బనగానపల్లెలో నేడే పోలింగ్!

Nandyal: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల సమరానికి బనగానపల్లె మండలంలో రంగం సిద్ధమైంది. మండలంలోని మొత్తం 24 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 12 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 12 గ్రామ పంచాయతీలు మరియు 124 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం (నవంబర్ 29) పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.పోలింగ్ కేంద్రాలకు సామగ్రి తరలింపుమండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం సాయంత్రం మండల పరిషత్ కార్యాలయం నుంచి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు మరియు ఇతర ఎన్నికల సామగ్రిని పటిష్టమైన పోలీసు భద్రత మధ్య సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలించారు. సిబ్బంది, సామగ్రి రవాణా కోసం ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలను వినియోగించారు.

ఈ గ్రామ పంచాయతీలో పోలింగ్మండలంలో ఎన్నికలు జరగనున్న మొత్తం 12 గ్రామపంచాయతీలో 25,070 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు గ్రామ పంచాయతీల వారీగా పసుపలలో 3556 మంది ఓటర్లు, గులాం అలీయబాద్తండాలో 608 మంది, పాతపాడులో 2393 మంది, క్రిష్ణగిరిలో 938 మీరాపురంలో 2245, తమ్మడపల్లెలో 1729, ఇల్లూరు కొత్తపేటలో 3326, ఎర్రగుడిలో 1997,వెంకటాపురంలో 1674, టంగుటూరులో 2864, తిమ్మాపురంలో 1702 మంది చెర్వుపల్లెలో 2038 మంది మొత్తం 25070 మంది ఓటర్లున్నారు.మొత్తం 25,070 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

7గట్టి నిఘా భారీ బందోబస్తుఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడ సీసీ కెమెరాల నిఘాతో పాటు అదనపు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి వార్డులు, పంచాయతీల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టి, సాయంత్రానికే విజేతల వివరాలను ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle