Koilakuntla: బస్సు ఫిట్‌నెస్ లేకపోతే సీజ్.. రంగంలోకి తిమ్మరసు నాయుడు!

Koilakuntla: నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో ప్రైవేట్ పాఠశాల బస్సులపై బ్రేక్ ఇన్‌స్పెక్టర్ తిమ్మరసు నాయుడు మెరుపు దాడులు చేశారు.

Ramanaiah, Banaganepalle
Updated on: 12 May 2026 10:22 AM IST
Koilakuntla
X

Koilakuntla: బస్సు ఫిట్‌నెస్ లేకపోతే సీజ్.. రంగంలోకి తిమ్మరసు నాయుడు!

కోవెలకుంట్ల: కోవెలకుంట్ల పట్టణంలో 30 ప్రవేట్ పాఠశాలకు చెందిన బస్సులను తనిఖీ చేసిన నంద్యాల బ్రేక్ ఇన్స్పెక్టర్ తిమ్మరసు నాయుడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. నియమ నిబంధనలు పాటించకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు సామర్ధ్యానికి మించి విద్యార్థులను తరలిస్తే సహించేది లేదన్నారు. బస్సులకు సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ లో ఉండాలని డ్రైవర్లు యూనిఫామ్ కలిగి ఉండాలని పిల్లల పట్ల మర్యాదగా ఉండాలి అన్నారు. ప్రతి విద్యార్థి క్షేమంగా స్కూల్ నుండి ఇంటికి వెళ్లాలన్నదే ప్రధాన ఉద్దేశమని నంద్యాల బ్రేక్ ఇన్స్పెక్టర్ తిమ్మరసు నాయుడు అన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story