Markapur: 60 బోర్ల కేబుల్ వైర్లు చోరీ!
Markapur: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం కటకానిపల్లి గ్రామంలో గుర్తుతెలియని దుండగులు 60 వ్యవసాయ బోర్ల కేబుల్ వైర్లను దొంగిలించారు.
Markapur: 60 బోర్ల కేబుల్ వైర్లు చోరీ!
Markapur: మార్కాపురం జిల్లా, పెద్ద దోర్నాల మండలం, కటకానిపల్లి గ్రామంలో గుర్తుతెలియని దుండగులు ఏకంగా 60 వ్యవసాయ బోర్లకు సంబంధించిన విద్యుత్ కేబుల్ వైర్లను కత్తిరించి అందులోని కాపర్ వైర్లను దొంగిలించారు. ఈ ఘటనతో గ్రామ రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
వేకువజామున విద్యుత్ సరఫరా రావడంతో పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు బోర్ల వద్ద కేబుల్ వైర్లు కత్తిరించి ఉండటాన్ని గుర్తించి దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో అరటి, బొప్పాయి, పత్తి, మిరప తదితర పంటలకు సాగునీరు అందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు.
అంతేకాకుండా, గ్రామానికి మంచినీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్‌కు సంబంధించిన విద్యుత్ కేబుల్‌ను కూడా దొంగలు అపహరించారని గ్రామస్తులు ఆరోపించారు. వరుసగా జరుగుతున్న ఈ దొంగతనాలతో రైతులు భయాందోళనకు గురవుతున్నట్లు పేర్కొన్నారు.




