Nandyal: నంద్యాల మెగా మార్ట్లో ఉద్యోగిపైకి దూసుకెళ్లిన సరుకుల వాహనం!
Nandyal: మెగా మార్ట్ సెల్లార్లో సరుకుల వాహనం ఢీకొని ఉద్యోగి కాలు విరిగింది. సెల్లార్ అనుమతులపై అధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Nandyal: నంద్యాల మెగా మార్ట్లో ఉద్యోగిపైకి దూసుకెళ్లిన సరుకుల వాహనం!
Nandyal: నంద్యాల పట్టణంలో మెగా మార్ట్లో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. రాజ్ థియేటర్ సమీపంలోని మెగా మార్ట్ సెల్లార్లో సరుకులు తరలించే వాహనం ఉద్యోగిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఉద్యోగికి తీవ్ర గాయాలు కాగా బాధితుడి కాలు పూర్తిగా విరిగిపోయింది. తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఉద్యోగిని వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
అయితే ఈ ఘటనపై మెగా మార్ట్ సెల్లార్ అనుమతులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెల్లార్కు అవసరమైన అనుమతులు లేవంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనుమతులు లేకుండానే సెల్లార్ నిర్వహిస్తున్నారా?.భద్రతా ప్రమాణాలు పాటించారా?.ఉద్యోగి తీవ్రంగా గాయపడేంత ప్రమాదం జరిగిన నేపథ్యంలో అధికారులు స్పందించి సెల్లార్ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.




