Srisailam: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, తుఫాను వాహనం ఢీ!
Srisailam: శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు-తుఫాను వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలు.
Srisailam: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, తుఫాను వాహనం ఢీ!
Srisailam: శ్రీశైలం ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం శ్రీశైలం నల్లమల ఘాట్లో ఆదోని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తుఫాను వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం విజయపూర్ జిల్లా పసుర్ గ్రామానికి చెందిన అశోక్, ఎర్రగట్టి రాఘవేంద్ర, చిక్కి సోమేశ్ చౌహన్ గాయపడ్డారు. గాయపడిన వారిని108 సిబ్బంది హుటాహుటిన పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రభుత్వ వైద్యురాలు లావణ్య చికిత్స అందిస్తున్నారు. రెండు గంటలపాటు ట్రాఫిక్ అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
Next Story




