Kurnool: డీఐజీ, ఎస్పీలను కలిసిన ఆదోని ఏఎస్పీ జయ శర్మ
Kurnool: ఆదోని నూతన ఏఎస్పీ జయ శర్మ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. అధికారుల అభినందనలు.
Kurnool: డీఐజీ, ఎస్పీలను కలిసిన ఆదోని ఏఎస్పీ జయ శర్మ
కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోని ఏఎస్పీగా నూతనంగా నియమితులైన జయ శర్మ ఐపీఎస్ గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్ ని, కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
గతంలో గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా విధులు నిర్వహించిన జయ శర్మ ఐపీఎస్ గారు, ఆదోని ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్ ని, కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ జయ శర్మ ఐపీఎస్ కి శుభాకాంక్షలు తెలియజేసి, ఆదోని సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.




