Devanakonda: కర్నూలు జిల్లాలో ఉపాధి కూలీల భారీ ధర్నా!

Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం, సచివాలయాల ముందే భారీ నిరసన చేపట్టారు.

G Jagadeesh, Pathikonda
Published on: 21 May 2026 10:50 AM IST
Devanakonda
X

Devanakonda: కర్నూలు జిల్లాలో ఉపాధి కూలీల భారీ ధర్నా!

దేవనకొండ: రాజకీయ కారణాలతో మండలంలోని వివిధ గ్రామాలలో ఉపాధి పనులు నిలపీ వేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాడు ఎంపీడీవో కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలు బైఠాయించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు బీ. వీర శేఖర్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో పనులు కల్పించాలని కరివేములలో వెంటనే పనులు మొదలుపెట్టాలని అదేవిధంగా ఉపాధి ఉసురు తీసే ఫేస్ యాప్ ను రద్దు చేయాలని రెండు పూటల పని పేరుతో కూలీలను వేధించరాదని ఆయన డిమాండ్ చేశారు.

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉపాధి పరిరక్షణ, పనులు కల్పన, ఫేస్ యాప్ రద్దు, పాత పద్ధతిలోనే ఉపాధి పని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయింపు మండలంలోని తెర్నేకల్,కోటకొండ, కుంకనూరు, దేవనకొండ సచివాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు కూలీలతో కలిసి ధర్నాలకు దిగారు.

ఈ సందర్భంగా వీరశేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు మహబూబ్ బాషా కార్యదర్శి వీరేంద్ర నాయుడు సిఐటియు మండల కార్యదర్శి అశోక్ , యూసుఫ్ భాష, డివైఎఫ్ఐ నాయకులు అనిలు లు ఆయా గ్రామాల లో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత భారత్ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం ( విబి-రాంబి) తో గ్రామీణ ప్రాంతాల్లో నీరుద్యోగం మరింతగా పెరిగిపోతుందనీ ఉపాధికి ఇది ఉరితాళ్ళు మోసపూరిత కుట్రఅని , కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి, గ్రామీణ కార్మికులను కార్పొరేట్ శక్తులకు చౌక శ్రమగా మార్చడానికి పద్ధతి ప్రకారం దీన్ని బలహీనపరుస్తుంది, వి బి జి రాంజీ అనేది పని హక్కులను కాలరాసే ఒక ప్రమాదకరమైన స్కీమ్ అని.

ఇది ఉపాధి కల్పించే చట్టం కాదన్నారు నిరుద్యోగం ,వలసలు పెంచే గ్యారెంటీ ఇచ్చే పథకమన్నారు పేరుకి 125 రోజుల పని దినాలు కల్పిస్తున్నాం అంటూ 60 రోజులు వ్యవసాయ సీజన్లో నిషేధించారనీ పేర్కొన్నారు దీనివలన పని దినాలు తగ్గుతాయని, కొత్త చట్టం ప్రకారం 60 శాతం నిధులు కేంద్రము,రాష్ట్రాలు 40 శాతం నిధులు భరించాలని కొత్త చట్టం చెబుతుందనీ, ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని పేర్కొన్నారు దీనివల్ల భారీగా పెండింగ్ వేతనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

రోజుకు రెండుసార్లు డిజిటల్ హాజరు పని ప్రదేశాల్లో కార్మికుల ఫోటోలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని నిర్బంధ విధానాలు ఆచరణ సాధ్యం కాదని, ఉపాధి హామీ రక్షణకు పని ప్రదేశాలు నిరసన తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు ఇచ్చే 300 కు 100 అడ్డంకులు సృష్టించి ఉపాధి నుండి మనల్ని దూరం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని, పేర్కొన్నారు ఫేస్ యాప్ రెండు పూటల పనినీ రద్దు చేయాలి.పెండింగ్ వేతనాలు ప్లే సిప్స్ పనిముట్ల ప్రమాదంలో చనిపోతే 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని.

కార్మికులకు పనిముట్లు ఇవ్వాలని మంచినీళ్లు టెంటు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బజారి, కె.పి రాముడు, సుధాకర్ ,రవీంద్ర, నాగరాజు,రాముడు, బాలాజీ, చంద్ర శేఖర్,తలారి హన్మయ్య,,వెంకటేష్,రాజన్న, కోటకొండ సుంకన్న, సుభాన్ కౌలుట్లయ్య, రాజు, మహేంద్ర, నాగేంద్ర, దస్తగిరి ఆయా గ్రామాల్లో కూలీలు పాల్గొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story