Kodumur: అనుమతులు లేని స్కూల్ ప్రచారాలపై ఎఐఎస్ఎఫ్ ధర్నా
Kodumur: కోడుమూరులో ప్రభుత్వ అనుమతులు లేని జీనియస్ గ్లోబల్ పాఠశాల యాజమాన్యంపై మండిపడిన ఏఐఎస్ఎఫ్.
Kodumur: అనుమతులు లేని స్కూల్ ప్రచారాలపై ఎఐఎస్ఎఫ్ ధర్నా
Kodumur: కోడుమూరు పట్టణంలో గత రెండు నెలలుగా ప్రభుత్వ అనుమతులు లేని జీనియస్ గ్లోబల్ పాఠశాల యాజమాన్యం ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్పందించిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రచార పత్రాలను, ఫ్లెక్సీలను చించివేసి దగ్ధం చేశారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి సర్కిల్ నందు ధర్నా నిర్వహించారు.
ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు రంగస్వామి మాట్లాడుతూ పట్టణంలో ఇన్ని రోజులుగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేని పాఠశాల యాజమాన్యం పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుతుంటే మండల అధికారులు, జిల్లా అధికారులు దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడం సిగ్గు చేటు ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే అధికారుల తీరుపై ధర్నా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు డి.వీరేంద్ర కార్యదర్శి అల్తాఫ్ బాషా నాయకులు సిద్దు, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.




