Nandyal: రోళ్లపాడులో ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ సమావేశం!
Nandyal: మిడుతూరు మండలం రోళ్లపాడు గ్రామంలోని బరక సంజీవరాయ ఆలయ ప్రాంగణంలో ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం ఘనంగా జరిగింది.
Nandyal: రోళ్లపాడులో ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ సమావేశం!
నంద్యాల జిల్లా: మిడుతూరు మండలం రోళ్లపాడు గ్రామంలోని బరక సంజీవరాయ ఆలయంలో ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల నుంచి 83 మంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు.
నూతన అధ్యక్షుడిగా డా. ప్రదీప్ జ్యోతి (కేరళ) జనరల్ సెక్రటరీగా యశ్వంత్ తివారీ (చండీఘర్) ట్రెజరర్గా కొండపల్లి కేశవరావు (తెలంగాణ) మహిళా వింగ్ అధ్యక్షురాలిగాబెంగళూరుకు చెందిన మాలిని అలాగే- యువజన విభాగం అధ్యక్షుడిగా నవీన్ (ఆంధ్రప్రదేశ్) ను ఎన్నుకున్నారు.
డా. ప్రదీప్ జ్యోతి మాట్లాడుతూ – “పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు అయిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో సమావేశం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. 1984లో విశాఖపట్నంలో ఫెడరేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి బ్రాహ్మణ సంఘ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. ప్రభుత్వ ఆధీనంలోని దేవాలయాలు హిందువుల నిర్వహణలోకి రావడానికి కృషి చేయాలి.
దేశంలో కులప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లను తొలగించి, ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించి ఆదుకోవాలి” అని కోరారు. ఈ ప్రాంతానికే చెందిన రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చెరుకుచెర్ల రఘురామయ్య కోరిక మేరకే ఇక్కడ ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఆయన చేరుకోవాలని కోరారు. జనరల్ సెక్రటరీ యశ్వంత్ తివారీ మాట్లాడుతూ – “ఎన్నికను నిష్పక్షపాతంగా నిర్వహించిన పంజాబ్‌కు చెందిన పండిట్ శేఖర్ శుక్లకు ధన్యవాదాలు. మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయం” అని తెలిపారు.




