Guduru: గూడూరు నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో హోరాహోరీ సమరం!

Guduru: కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీ. 6వ వార్డులో కూటమి ఛైర్మన్ అభ్యర్థి డమాం సునీత బాయి విస్తృత ప్రచారం.

C. Ganesh, Kodumuru
Published on: 29 Oct 2026 10:42 AM IST
Guduru
X

Guduru: గూడూరు నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో హోరాహోరీ సమరం!

Guduru: కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. కూటమి ఛైర్మన్ అభ్యర్థి డమాం సునీత బాయి ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. కూటమి ఐక్యతే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు.

ప్రచారంలో భాగంగా గూడూరు నగర పంచాయతీలోని 6వ వార్డులో డమాం సునీత బాయి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలను కలిసి తమ అభ్యర్థికి మద్దతు కోరారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు డమాం సురేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని తెలిపారు. డమాం సునీత బాయి ఛైర్మన్‌గా ఎన్నికైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గూడూరు నగర పంచాయతీని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru