Kurnool: ప్రత్యుష విజయానికి కూటమి నేతలు పనిచేయాలి: దస్తగిరి

Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ టీడీపీ మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల ప్రత్యుష విజయానికి కూటమి నాయకులు సమన్వయంతో కృషి చేయాలని కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి పిలుపునిచ్చారు.

C. Ganesh, Kodumuru
Published on: 25 Oct 2026 10:14 PM IST
Kurnool
X

Kurnool: ప్రత్యుష విజయానికి కూటమి నేతలు పనిచేయాలి: దస్తగిరి

కర్నూలు: కర్నూలు నగరపాలక సంస్థ తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల ప్రత్యుష విజయానికి కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పిలుపునిచ్చారు.

కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కర్నూలు కార్పొరేషన్ 51, 52, 53, 54వ వార్డుల ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని ఆయన సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తూ ప్రజలతో మమేకమై ముందుకు సాగాలని పేర్కొన్నారు.

కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ పంచాలింగాల నాగరాజు, కర్నూలు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల ప్రత్యుషతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru