Giddalur: ప్రతి గడపకు కూటమి సంక్షేమ పథకాలు చేరాలి: ఎమ్మెల్యే ముత్తుముల!

Giddalur: రాబోయే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల కార్యాచరణపై ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమీక్షించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 14 Nov 2026 7:07 PM IST
Giddalur
X

Giddalur: ప్రతి గడపకు కూటమి సంక్షేమ పథకాలు చేరాలి: ఎమ్మెల్యే ముత్తుముల!

మార్కాపురం జిల్లా, గిద్దలూరు: రాబోయే సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల కార్యాచరణపై గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గ్రామంలోని ప్రతి గడపకు చేరవేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాల వివరాలను తెలియజేస్తూ,అభ్యర్థి గెలుపు కై సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.

సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో స్థానిక పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, నాయకులు, కార్యకర్తల సమన్వయానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల కార్యాచరణపై మండలాల వారీగా నాయకులతో చర్చించి పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో నియోజకవర్గంలోని కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU