Kurnool: ఇంధనం దొరక్క అల్లాడుతున్న ఆటో డ్రైవర్లు!

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరులో పెట్రోల్, డీజిల్ కొరతపై సిఐటియు (CITU) ఆటో యూనియన్ నిరసన.

Bheemalinga, Aluru
Published on: 28 April 2026 1:34 PM IST
Kurnool
X

Kurnool: ఇంధనం దొరక్క అల్లాడుతున్న ఆటో డ్రైవర్లు!

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు లో సిఐటియు ఆటో యూనియన్ నాయకులు బళ్లారి రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు కలిసి బంక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేపీ నారాయణస్వామి, కృష్ణ, మాట్లాడుతూ, ఇంధన కొరత వల్ల తమ జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఆదాయం తగ్గిపోవడంతో కుటుంబాలను పోషించడం కష్టమవుతోందని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, లేదంటే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story