Kurnool: ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ను అడ్డుకున్న అరికెర వైసీపీ కార్యకర్తలు!
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత. ఎమ్మెల్యే విరూపాక్షిని అడ్డుకున్న అరికెర గ్రామ వైసీపీ కార్యకర్తలు.
Kurnool: ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ను అడ్డుకున్న అరికెర వైసీపీ కార్యకర్తలు!
కర్నూలు జిల్లా: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కి అరికెర గ్రామ వైసీపీ కార్యకర్తలు నిరసన సెగ చూపించారు. సోమవారం రాత్రి ఆలూరు మండలం అరికెర గ్రామం లో సర్ పై అవగాహన కార్యక్రమాన్ని బంగారమ్మ అవ్వ ఆలయం వద్ద నిర్వహించారు. ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ కు గురైన వైసీపీ మండల కో కన్వీనర్ అరికెర వీరేష్ తో పాటు బంధువులు, అనుచరులు ఒక్కసారిగా ఎమ్మెల్యే వాహనాన్ని చుట్టుముట్టారు.
దీంతో 10 నిమిషాల పాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.. ఏ కారణం చేత పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంటూ ప్రశ్నించారు..ఇందుకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే ను పట్టుబట్టారు. ఆలూరు లో జరిగిన మీటింగ్ లో గొడవ పెట్టుకున్నందుకే జిల్లా అధ్యక్షులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు.
స్థానిక వైసీపీ నాయకులు వివాదాన్ని సర్దుమనిగించి అక్కడ నుంచి ఎమ్మెల్యేను పంపించివేశారు. ఈ ఘటన కు సంబంధించిన వీడియో లు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. దీంతో వైసీపీ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.




